Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయకు బిజెపి నివాళి

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:17 IST)
జన సంఘ్ నేత, నిస్వార్ధ నాయకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భాజపా నాయ‌కులు అల్లంగి అనిల్ కుమార్ ఆధ్వర్యాన  హుకుంపేట గోదావరి ఫంక్షన్ హాల్ లో శనివారం ఈ కార్య‌క్ర‌మం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యానాపు ఏసు,  రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పన్నాల వెంకట లక్ష్మి , మండల ఇంచార్జ్ కాలెపు సత్య సాయిరాం, జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెద్దు స్వామి, జిల్లా కార్యదర్శి తనుబుద్ధి సూర్య భాస్కర్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఆకుల నర్స వేణి, మండల ప్రధాన కార్యదర్శి ఎన్.వి.బి.యన్.ఆచారి. డాక్టర్ మూర్తి. మల్లాడి వరప్రసాద్, తదితరులు హాజరై, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
కొందరు... మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారని పలువురు కీర్తించారు.  చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్‌ మేనమామ ఇంటిలో పెరిగారని, 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్‌ కాన్పూర్‌లో బి.ఎ, చదువుతున్న ప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడి,  అప్పటినుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయిందని, సంఘ్‌లో పనిచేస్తూనే బి.ఎ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఎ, ప్రథమ సంవత్సరం పూర్తిచేసి, సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారని పేర్కొన్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింప జేశారని,  అది గమనించిన సంఘ్‌ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారని,  సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేసి, దాని ద్వారా 'రాష్ట్ర ధర్మ'  మాస పత్రిక, పాంచజన్య వారపత్రిక, స్వదేశ్‌ అనే దిన పత్రిక ప్రారంభించారని వివరించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయన్నారు.  జనసంఘ్ ద్వారా పార్టీ కార్యకలాపాలను నిర్వహించి, ప్రజాప్రతినిధిగా నిస్వార్ధ సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దీనదయాళ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రతిన బూనాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments