Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ స్థలాల సర్వే కోసమే జగన్ పాదయాత్ర: లోకేశ్‌

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (07:41 IST)
"మిషన్‌ క్విడ్‌ ప్రోకో మళ్లీ ప్రారంభమైంది. జగన్‌ రోజుకు 3 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారంటే.. అప్పుడే అనుమానం వచ్చింది. పాదయాత్రలో జగన్‌ ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తి చేశారన్నమాట.

విలువైన ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కొట్టేసేందుకు జగన్‌ అండ్‌ క్విడ్‌ ప్రోకో కంపెనీ స్కెచ్‌ వేసింది. వలంటీర్ల పేరుతో ఒకవైపు ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ.. మరోవైపు పథకాలకోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తామంటే ఊరు కోం" అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో హెచ్చరించారు.
 
మీ అమ్మాయిలు తెలుగు మీడియంలోనే చదివారా?
‘ఇంగ్లీ షు మీడియం వద్దు.. తెలుగే ముద్దు’ అని విపక్షంలో ఉండగా జగన్‌ ఉద్యమం చేసినప్పుడు ఆయన అమ్మాయిలు తెలుగు మీడియంలోనే చదివారా? అని టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

‘అయ్యా గజిని జగన్‌! మీ పవిత్ర పత్రిక, మీ రు, గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తులేదా? నగరపాలక పాఠశాలల్లో అప్పటి మా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తే అప్పట్లో మీరు అడ్డుపడ్డారు.

ఎందుకింత తెగులు? తెలుగు లెస్సేనా? అంటూ ఉద్య మం చేసిన రోజు మీ బుద్ధి ఏమైంది? ఇంగ్లీషు మీడి యం వద్దు. తెలుగే ముద్దు! అన్నప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలోనే చదివారా? చెప్పండి?’ అని సోమవారం ట్విట్టర్‌లో ప్రశ్నలు సంధించారు.
 
మృత భాషగా మార్చే కుట్ర: కాల్వ
మాతృభాష తెలుగును సీఎం జగన్‌ మృత భాషగా మార్చే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్‌కు తెలుగులో మాట్లాడటం సరిగా రాదు కాబట్టి.. ఇంకెవరూ మాట్లాడకూడదు అన్నట్లుగా జీవో జారీ చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments