Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై దాడి కేసు విచారణ ముమ్మరం

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (16:23 IST)
ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాస్‌ రావు చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు.
 
నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. దాడికి రెండ్రోజుల ముందే శ్రీనివాస్‌ కొత్త సిమ్‌ కొనుగోలు చేయడంతో దానికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. 
 
నిందితుడు పనిచేసే రెస్టారెంట్‌ యజమానికి సైతం నోటీసులు జారీచేసి విచారణ చేశారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాస్‌ను ఎవరైనా ప్రలోభపెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు గతంలో కొద్దిరోజులు దుబాయిలో పనిచేశాడని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments