Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక మాఫియాను ''లోకేష్ ర్యాంప్'' అని పిలుస్తున్నారు: జగన్

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మండలంలోని లంకల గన్నవరంలో రోజూ వేల లారీల ఇసుక ద

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (10:09 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మండలంలోని లంకల గన్నవరంలో రోజూ వేల లారీల ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక మాఫియాను లోకేష్ ర్యాంప్ అని స్థానికులు పిలుచుకుంటున్నారని తెలిపారు.
 
ఈ ప్రాంతానికి అధికారులు కానీ, పోలీసులు కానీ ఎవ్వరూ వెళ్లట్లేదని ఆరోపించారు. మట్టిని, ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాలతో విసిగిపోయిన కోనసీమ రైతులు, కూలీలు వలసపోతున్నారని.. కొబ్బరిపై ఐదు శాతం జీఎస్టీని చంద్రబాబు వేయించారని జగన్ తెలిపారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తూ యుద్ధానికి వెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చివరికి ఉత్తర కుమారుడు మాదిరిగా తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఏదో చేస్తానని వెళ్లిన చంద్రబాబు.. చివరికి మోదీకి వంగి వంగి షేక్ హ్యాండిచ్చేందుకు యత్నించారని చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ భర్తను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిస్తున్నారని, మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ మెంబర్ పదవి కట్టబెట్టారని, మరోవైపు బాలకృష్ణ షూటింగ్‌కు వెంకయ్యనాయుడు వస్తారని పేర్కొంటూ.. బీజేపీ, టీడీపీ బంధం కొనసాగుతోందనడానికి ఇవే సాక్ష్యాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments