Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి ఉన్నత చదువులు చదివించాలనుకుంటే.. అమ్మాయి ఇంటి నుంచి?

తండ్రి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. కుమార్తెను హాస్టల్‌లో చేర్పించి చదివించేందుకు అంతా సిద్ధం చేశాడు. కానీ తండ్రి కోరుకున్నట్టుగా హాస్టల్ కు వెళ్లి చదువుకోవడం ఇష్టంలేని ఓ కూతురు ఇల్లొదిలి వెళ్లి

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (09:29 IST)
తండ్రి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. కుమార్తెను హాస్టల్‌లో చేర్పించి చదివించేందుకు అంతా సిద్ధం చేశాడు. కానీ తండ్రి కోరుకున్నట్టుగా హాస్టల్ కు వెళ్లి చదువుకోవడం ఇష్టంలేని ఓ కూతురు ఇల్లొదిలి వెళ్లిపోయిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పద్మాలయ అంబేద్కర్ నగర్‌లో నివసించే అప్పారావు, అపోలో ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుండగా, ఆయన కుమార్తె దీపిక (20) ఇంటర్ పూర్తి చేసుకుంది. 
 
ఆమెను ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో అప్పారావు.. డిగ్రీ కోసం గురుకులంలో చేర్పించాలని భావించి ఫీజు కట్టాడు. బుధవారం నాడు ఆమెను హాస్టల్‌లో దించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఓ లేఖ రాసిపెట్టిన దీపిక, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 
 
తనకు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేదని, తాను అనుకున్నది వేరు, నాన్న చేస్తున్నది వేరని, తనకు నచ్చింది చేయనివ్వడం లేదని వాపోయింది. బలవంతంగా హాస్టల్‌కు వెళ్లి చదువుకోలేనని చెప్పింది. అప్పారావు ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments