విద్యాలయాలు తెరిచేది అనుమానమే

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:50 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా విద్యాలయాలను కూడా మూసేశారు.

అయితే వచ్చే 14వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విద్యాలయాలు తెరిచేది అనుమానంగానే వుంది. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం.

ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్‌ పాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.

ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.

ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్‌ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments