Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీ నోటీసులు.. లబోదిబో మంటున్న ప్రత్తి రైతులకు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (16:29 IST)
కృష్ణా జిల్లా మైలవరం ఆరుగాలం కష్టించి పండించిన ప్రత్తి పంటను అమ్ముకుని ఫలితం చేతికొస్తుందనుకున్న తరుణానికి డబ్బు రావలసిన కొనుగోలుదారు నుండి ఐపీ నోటీసులు అందడంతో లబోదిబో మంటూ రోడ్డెక్కారు మండలంలోని పుల్లూరు పరిసర ప్రాంత ప్రత్తి రైతులు. గత 10 సంవత్సరాలుగా ప్రత్తి రైతుల వద్ద ప్రత్తి కొనుగోళ్ళు జరుపుతూ, సుపరిచితంగా మెలుగుతూ లావాదేవీలు నిర్వహిస్తున్న పుల్లూరు పంచాయతీ కొత్తగూడెం వాస్తవ్యుడు కరుణ వర ప్రసాద్‌కు.
 
ఎప్పటిలాగానే చేతికొచ్చిన తమ ప్రత్తి పంటను అమ్మామని, తీరా డబ్బు ఇవ్వాల్సిన సమయానికి ఇదుగో అదుగో అంటూ కాలయాపన చేస్తూ ఐపీ నోటీసులు పంపాడనీ వాపోయారు ప్రత్తి రైతులు. ఎన్నో ఆశలతో పంటను అమ్మి పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అప్పులూ అంటూ పలు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న తమకు ఇలా డబ్బు ఇవ్వకుండా కోర్టులో తేల్చుకోమంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కరుణ వరప్రసాద్ సుమారు 175 మంది రైతులకు ఐదు కోట్ల వరకు డబ్బు ఎగనామం పెట్టాడని రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నాకి దిగడంతో ఒకానొక సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
ఆత్మహత్యే శరణ్యమంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన రైతులతో మైలవరం సీఐ శ్రీను, ఎస్ఐ ఈశ్వర రావు మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఐ తెలిపడంతో ఆందోళన విరమిస్తున్నామని, ప్రభుత్వం తమను ఆదుకుని న్యాయం చేయాలని కర్షకులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments