Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు
, మంగళవారం, 9 జులై 2019 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మినీ డైనాసర్లు వలే వుండే ఇగువానా అనే రకానికి చెందిన తొండలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సముద్రంలో, భూమిపై నివసించే ఈ ఇగువానాలను మచిలీపట్నం చేపల మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. 
 
ఆపై అటవీ శాఖ ఆ మార్కెట్లో జరిపిన తనిఖీల్లో రెండు పెట్టెల్లోని 50కి మించిన ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ పట్టుకున్నారు.. అక్రమ రవాణా చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఇగువానాలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టామని.. అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే అనుమానం పేరిట ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరిట పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష