Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రిలో సేవకై సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఆహ్వానం

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (08:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించనున్న శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ( శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ) ఆసుపత్రి లో  స్వచ్ఛంద సేవలు అందించడానికి  భారతదేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో  పనిచేస్తున్న సీనియర్ పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, డాక్టర్లును ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
టీటీడీ ప్రాణదానం పథకం కింద నిర్వహించనున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరియు పిల్లలకు గుండె చికిత్సలు,  వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన డాక్టర్లు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది.

ఈ స్వచ్ఛంద సేవలను ఆప్షన్ A మరియు ఆప్షన్ B అనే రెండు విధానాలలో చేయవచ్చును.  ఆప్షన్ A విధానం లో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్ తో పాటు ఐదుగురు  కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రోటోకాల్ దర్శనం,  తిరుమల - తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించడం జరుగుతుంది. 

ఆప్షన్ B కింద.స్వచ్ఛంద సేవ కై ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషకం చెల్లించడం జరుగుతుంది. ఆప్షన్ B ఎంచుకునే వారికి వసతి, దర్శనం, స్థానికంగా రవాణా సదుపాయాలు కల్పించడం జరగదు.

ఆసక్తి గల వైద్యనిపుణులు cmo.adldirector@gmail.com  మెయిల్ ఐడి కి తమ వివరాలతో పాటు ఏయే  కేటగిరీ కింద ఆసక్తి  ఉందో తెలియజేస్తూ,  వారి యోగ్యతా పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments