Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డి ప్రమేయముందేమో?!: బుద్దా వెంకన్న

డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డి ప్రమేయముందేమో?!: బుద్దా వెంకన్న
, సోమవారం, 4 అక్టోబరు 2021 (08:03 IST)
రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) గుజరాత్ పోర్టు లో పట్టుబడటం మొదలు, వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ2 విజయసాయిరెడ్డి  తనపార్టీవారికి కూడా కనిపించ కుండా తిరుగుతున్నాడని, ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో విజయసాయితోపాటు, అతని అల్లుడిప్రమేయం కూడా ఉందని తమకు అనిపిస్తోందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆరోపించారు. 
 
విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికిసంబంధించిన పోర్టుల్లో వాటా లున్నాయని, కాబట్టే పోర్టులద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని,  ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర బిగ్ బాసేనని వెంకన్న తేల్చిచెప్పారు. ప్రజలతోపాటు, అన్నిపార్టీలవారు రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న మాదకద్రవ్యాలపై చర్చించుకుంటుంటే, బిగ్ బాస్ గానీ , విజయసాయిరెడ్డి గానీ ఎందుకు ఈ వ్యవహారంపై నోరెత్తడం లేదని బుద్దా ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడో బిగ్ బాస్ కే తెలుసునని, వారిద్దరి మధ్యన ఉన్న అనుబంధం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ వ్యవహారానికి, విజయసాయిరెడ్డికి సంబంధంలేకపోతే, ప్రతిపక్షాలవ్యాఖ్యలపై ఆయనెందుకు స్పందించడంలేదన్నారు? 
 
లక్షలకోట్ల ప్రజాధనాన్ని ఎలా దోపిడీచేయాలో వివరిస్తూ, గతంలో మాస్టర్ ప్లాన్లు వేసిన విజయసాయిరెడ్డికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధంలేదంటే ఎవరూనమ్మరన్నారు. పోలీసులు తక్షణమే డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డిని విచారించాలని, వారంపాటుకస్టడీలో ఉంచైనాసరే వాస్తవాలు రాబట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. 
 
అయినదానికీ, కానిదానికీ ప్రశ్నించేవారిపై, ప్రతిపక్షాలపై ఎస్టీ ఎస్సీ కేసులుపెట్టే పోలీసులు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నడ్రగ్స్ దందాలో ప్రమేయమున్న విజయసాయిని ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ నేత ప్రశ్నించారు.  చంద్రబాబునాయుడిని, ఇతరప్రతిపక్షపార్టీల నేతలను ఉద్దేశించి, ఇష్టమొచ్చినట్లు మొరిగేకుక్కలన్నింటినీ, టీడీపీప్రభుత్వం వచ్చాక కుక్కలవ్యాన్ ఎక్కించి, ఎక్కడికిచేర్చాలో అక్కడికే చేరుస్తామని వెంకన్న హెచ్చరించారు. 
 
రూ.43వేలకోట్ల సొమ్ముఈడీద్వారా జప్తుకాబడినకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయసాయి, నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గతంలో విశాఖకేంద్రంగా జరిగిన అనేక భూదందాలు,  ఆక్రమణలు, ప్రభుత్వ భూములస్వాహాకు సంబంధించిన వ్యవహారాల్లో విజయసాయిరెడ్డే ప్రధానవ్యక్తిగా వ్యవహరించాడన్నారు. 
 
రాష్ట్రంలో బిగ్ బాస్ సాగిస్తున్నఇసుకదందా, డ్రగ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా వంటివాటన్నింటికీ సలహాలు, సూచనలుఇచ్చేదే విజయసాయిరెడ్డని, అలాంటివ్యక్తి డ్రగ్స్ వ్యవహారం బయటపడగానే ఎక్కడికి పోయాడన్నారు.  ఏంజరిగినా తుర్రుమంటూ ట్వీట్లుపెట్టే విజయసాయి, రాష్ట్రాన్ని కబళిస్తున్న డ్రగ్స్ర్ రాకెట్ పైఎందుకు ఒక్కసారికూడా స్పందించలేదన్నారు? 
 
ఉత్తరాంధ్రకేంద్రంగా సాగే అన్నివ్యవహారాలు,దోపిడీల్లో విజయసాయిరెడ్డిప్రమేయం స్పష్టంగా ఉందన్న బుద్దా, ఆప్రాంతానికిచెందిన మంత్రులెవరూ ఆయనకు వ్యతిరేకంగా నోరుతెరిచే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాలవారేనని, వారిని భయపెట్టి తనపబ్బంగడుపుకుంటూ తనఆస్తులుపెంచుకుంటున్న విజయసాయిరెడ్డి, తనఅవినీతిని ప్రశ్నిస్తున్న టీడీపీపై నిందలేయడం విచిత్రంగా ఉందన్నారు. 
 
విజయసాయిరెడ్డి తనగురించి, తనదోపిడీ, అవినీతి మర్చిపోయి, చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై ఆరోపణలుచేయడం సిగ్గుచేటని బుద్ధా మండిపడ్డారు.  వైసీపీప్రభుత్వం పోయాక, విజయసాయి అవినీతి, దోపిడీపై విచారణకు ఆదేశిస్తే, ఒక్కసీబీఐ తప్ప ఏ సంస్థాకూడా అతని అక్రమార్జన గుట్టుమట్లను తేల్చలేదని వెంకన్న స్పష్టంచేశారు. 
 
టీడీపీ అధికారంలోకివచ్చిన వెంటనే విజయసాయి అక్రమార్జన, అవినీతి వ్యవహారాలను నిగ్గుతేలుస్తామని, అవన్నీబయటపడితే, విజయసాయిరెడ్డి దోచినడబ్బుకు శిక్షలేయాలంటే చట్టాల్లో ఇప్పుడున్న శిక్షలుకూడా సరిపోవన్నారు.  ప్రజలను ఎల్లకాలం మోసంచేయలేరనే వాస్తవాన్ని విజయ సాయి, బిగ్ బాస్ లు గుర్తుంచుకుంటే మంచిదని వెంకన్న హిత వుపలికారు. 
 
వారుదోచిన సొమ్ముని రాష్ట్ర బడ్జెట్లో పెడితే, ఏపీలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లుఇవ్వవచ్చని, రోడ్లన్నీ బాగుచేయవచ్చని, ఉచితంగా పేదలకు అనేకసంక్షేమపథకాలు అమలు చేయవచ్చని వెంకన్న పేర్కొన్నారు. వందల తరాలకుసరిపడేలా ప్రజల సొమ్ముని ఏ1, ఏ2లు లూఠీచేశారన్నారు. 
 
ఆఖరికి రాష్ట్ర యువత తను నాశనంచేసి, కోట్లుకొల్లగొట్టడానికి ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా కూడా మార్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినవెంటనే,  ఉత్తరాంధ్రకేంద్రంగా విజయసాయి సాగించిన భూ ఆక్రమణలన్నింటిపై విచారణజరిపించి, ఎవరి భూములు వారికి ఇప్పించే తీరుతామని వెంకన్న తేల్చిచెప్పారు. 
 
ఇప్పటికైనా ఏ1 , ఏ2లు మారి, వారుదోచినదాన్ని పేదలకోసం పంచితే, కొంతలోకొంతైనా వారిజీవితాలు ప్రశాంతంగా ఉంటాయని బుద్దా హితవుపలికారు. ఇప్పటికైనా దోపిడీమాని, ఈప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో, రోజులు లెక్కబెట్టుకుంటూ గడిపితే మంచిదన్నారు.

పవన్ కల్యాణ్ ను పోసానితో  తిట్టించిన ప్రభుత్వ వైఖరిని తాముతీవ్రంగా తప్పుపడు తున్నామన్నారు. బూతులుమాట్లాడితే హీరోలు అవుతామని వైసీపీవారుభావిస్తున్నారని, వారికంటే నీచంగా బూతులు మాట్లాడే వారు చాలామందే ఉన్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11వ తేదీ ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభం