Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11వ తేదీ ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభం

11వ తేదీ ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభం
, సోమవారం, 4 అక్టోబరు 2021 (07:59 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడోత్సవం నాడు ఎస్ వి బి సి కన్నడ ఛానల్  ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మైని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.
 
బెంగుళూరులో  వారు సిఎం  బసవరాజ్ బొమ్మైని కలిశారు.  ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా,  అక్టోబర్ 11వ తేదీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం సందర్భంగా కన్నడ తో పాటు హిందీ ఛానల్ కూడా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
 
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని,  మీరు కూడా హాజరు కావాలని కోరారు. ఎస్ వి బి సి కన్నడ ఛానల్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

బసవ రాజ్ బొమ్మై మాట్లాడుతూ,  ఎస్ వి బి సి ఛానల్ కు  ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తామని చెప్పారు.  సిఎం కు  టిటిడి చైర్మన్, ఈవో శ్రీవారి ప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను అందించి శాలువతో సత్కరించారు.

అనంతరం చైర్మన్, ఈవో లను సిఎం శాలువతో సత్కరించారు.  టీటీడీ పాలక మండలిసభ్యులు శ్రీ విశ్వనాథరెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ లో 17న ‘అలయ్‌బలయ్‌’