తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్స్‌పై రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడి చేశారు.
కీలక డేటాను తస్కరించి డిలీట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.35 కోట్లు డిమాండ్ చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.
ఆ డబ్బు చెల్లిస్తేనే డేటా ఇస్తామంటూ షరత్ పెట్టారు. ఐతే డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. వెంటనే డిస్కమ్‌ల వెబ్‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.