Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిక్షగాడి గదిలో డబ్బులే డబ్బులు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (07:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో గురువారం ఓ భిక్షగాడు హఠాత్తుగా మరణించాడు. రేకుల షెడ్డులో ఉంటూ వచ్చిన ఆ బిచ్చగాడు చనిపోయిన విషయాన్ని పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ భిక్షగాడి గదిని పరిశీలించారు. ఇందులో వేలాది రూపాయల కరెన్సీ నోట్లను, చిల్లర ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటన ఇపుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భిక్షగాడు పేరు రామకృష్ణ. ఐదేళ్ల కిందట గ్రామానికి వచ్చాడు. భిక్షాటన చేస్తూ.. రక్ష రేకులు కడుతూ జీవనం సాగించేవాడు. చేపల మార్కెట్‌ వద్ద చిన్న గదిలో ఉంటూ సమీపంలోని సత్రంలో భోజనం చేసేవాడు. 
 
అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ విషయమై కరప ఎస్‌ఐ డి.రమేశ్‌బాబును మాట్లాడుతూ అతడి వద్ద లభించిన నగదులో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదన్నారు. 
 
నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం లెక్కిస్తామని చెప్పారు. పంచాయతీ కార్మికులతో సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments