Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటగ్యాస్ సబ్సీడీని పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (06:55 IST)
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్స సబ్సీడీని పూర్తిగా ఎత్తివేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే సిలిండర్లపై ఇకపై రాయితీ ఇవ్వనుంది. మిగిలిన వినియోగదారులంతా ఎల్పీజీ సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సిలిండరు ధరపై రూ.40 సబ్సీడీ ఇస్తున్నారు. ఇక నుంచి ఆ రాయితీ కూడా ఉండదు. వంట గ్యాస్ సిలిండర్లపై జూన్ 2020 నుంచి సబ్బీడీ ఇవ్వడం లేదని జైన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన మేరకు ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ ఇస్తామని చెప్పారు. 
 
ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.6100 కోట్ల భారం పడనుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments