Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలర్ట్: తుపానుగా మారే అవకాశం-ఏపీలో భారీగా వర్షాలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (11:19 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా కనిపిస్తున్నాయి. తర్వాత 12గంటల్లో తుపాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.
 
బుధవారం తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. విజయనగరం, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments