Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేస్తే సురేశ్ ఎంపీ పదవి ఊడుతుంది: పిల్లి మాణిక్యరావు

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (07:55 IST)
రాజధాని గ్రామమైన కృష్ణాయపాలెంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు, ఇద్దరు బీసీలపై పెట్టిన తప్పుడుకేసులకు సంబంధించి స్థానిక డీఎస్పీదుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేస్తున్నట్లు టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరు రూరల్ ఎస్పీ రైతులకు సంకెళ్లు వేయడాన్ని తప్పుపడుతూ, ఏడుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ కానిస్టేబుళ్లుఅలాచేసేలా పురికొల్పిన వ్యక్తి, రైతులపై అక్రమ కేసులు పెట్టిన వ్యక్తిని కూడా సస్పెండ్ చేయాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రైతులపై పెట్టే పరిస్థితి లేకపోయినా, ఫిర్యాదుదారుడే తనకేసును వాపసు తీసుకుంటానని చెప్పినా కూడా వినకుండా మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ ఓవర్ యాక్షన్ చేసి రైతుల చేతులకు సంకెళ్లు వేయించాడని మాణిక్యరావు మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేశ్ ఈ కథమొత్తాన్ని నడిపించాడని, ఆయన జగన్మోహన్ రెడ్డి పట్ల తనకున్న మితిమీరిన కృతజ్ఞతను నిరూపించుకోవడానికి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడన్నారు.

ఎంపీగా గెలిచిన సురేశ్ ఏనాడూ పార్లమెంట్ లో ప్రత్యేకహోదా గురించి, రాష్ట్రప్రయోజనాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఎంపీ సురేశ్ తనపార్టీకి చెందిన ఎంపీ  రఘురామకృష్ణంరాజుని ఎదుర్కోవడం చేతగాక, దళితకార్డుని అడ్డుపెట్టుకొని,  ఆయన్ని దుర్భాషలాడాడన్నారు. రాజ్యాంగం తనకు దళితులనుదూషించే హక్కు ఇవ్వలేదంటూ, సురేశ్ వ్యవహారశైలిపై రఘురామరాజు చాలా విజ్ఞతతో మాట్లాడాడన్నారు.

గతంలో తనపై ఎవరో దాడికి యత్నించారని వారిపై కూడా సురేశ్ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడని, టీడీపీకి చెందిన సజ్జా అజయ్ పై అదే కేసు పెట్టించాడన్నారు. సురేశ్ ఎంపీననే సంగతి మర్చిపోయి, తనగ్రామానికి చెందినవారిపైకూడా అలానే తప్పుడు కేసులు పెట్టించాడని మాణిక్యరావు చెప్పారు.

రాజధానికి భూములిచ్చిన రైతులు సర్వంకోల్పోయి, ఉద్యమాలు చేస్తుంటే, వారికి వ్యతిరేకంగా డబ్బులిచ్చి మనుషులనుతీసుకొచ్చి కౌంటర్ ఉద్యమాలు చేయించడం ఏమిటన్నారు.  దానిపై ప్రశ్నించారన్న నెపంతో కొందరు దళితులు, బీసీలపైకూడా సురేశ్ అట్రాసిటీ కేసులు పెట్టించాడన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎటువంటి పరిస్థితుల్లో దేశంలోకి వచ్చిందో సురేశ్ తెలుసుకోవాలన్న మాణిక్యరావు, 1985లో జరిగిన కారంచేడు ఘటన తరువాత అనేకమంది త్యాగాల ఫలితంగా 1989లో అట్రాసిటీ చట్టం రావడం జరిగిందన్నారు. అటువంటి చట్టాన్ని సురేశ్ లాంటివారు  వ్యక్తిగత ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎంపీహోదాలో ఉన్న సురేశ్ దుర్వినియోగం చేస్తున్నాడని ఎవరైనా పార్లమెంట్ లో ఫిర్యాదు చేస్తే, ఆయన పదవి ఊడుతుందని మాణిక్యరావు తేల్చిచెప్పారు. దానితోపాటు ఎస్సీ,ఎస్టీల  వజ్రాయుధమైన  అట్రాసిటీ చట్టాన్నికూడా రద్దుచేసే పరిస్థితులు ఏర్పడతాయన్నారు.

ఎంపీ పదవి ఉందికదా అని.. జగన్మోహన్  రెడ్డితో సెల్ఫీలు దిగడం కోసం సురేశ్ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. దళితులకు రక్షణగా నిలిచేచట్టాన్ని సురేశ్ లాంటివారు తప్పుడు పనులకోసం, స్వార్థంకోసం వినియోగిస్తున్న తీరుపై దళిత సంఘాలు, మేథావులు ప్రశ్నించాలని మాణిక్యరావు విజ్ఞప్తిచేశారు. 

సురేశ్ బాపట్ల నుంచి ఎంపీగా గెలిచాడని, ఆ నియోజకవర్గాన్ని వదిలేసి, అక్కడున్న సమస్యలను పట్టించుకోకుండా, ఎమ్మెల్యే శ్రీదేవి అసమర్థురాలైనట్లు ఆయన తాడికొండలో పెత్తనం చేయడమేంటని టీడీపీ నేత ప్రశ్నించారు.  రైతులకు సంకెళ్లు వేయించిన సురేశ్, ఇకనుంచైనా తన నీచపు పనులు మానుకోవాలని మాణిక్యరావుసూచించారు.
 
కొడాలినాని పనికిమాలిన మంత్రి అని, అతను తన మంత్రిపదవిని కాపాడుకోవడానికే లోకేశ్ ను, చంద్రబాబుని దూషిస్తున్నాడని, తన మంత్రిగిరీని కాపాడుకోవడం కోసం నాని, తన సామాజికవర్గాన్ని కూడా తాకట్టుపెట్టాడని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

వరదల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి లోకేశ్ వెళితే, అన్నదాతలను ఆదుకోవడం మానేసి, ఆయన్ని దుర్భాషలాడటం ఏమిటన్నారు.

రాష్ట్రంలో దొంగలు పడి ఇప్పటికే 17నెలలైందని, సహజవనరులన్నింటినీ, పాలనలోఉన్నకుక్కలు దోచుకుతింటున్నాయనే నిజాన్ని నాని గ్రహించాలన్నారు. తల్లికుక్క చనిపోయి, బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న పిల్లకుక్కకు అన్నంపెట్టి, తన ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే, సదరు కుక్క యజమాని లేని సమయంలో ఆయన ఇంట్లోకి దూరి మొత్తం తినేసినతీరుగా, కొడాలినాని తనను ఆదరించి, అన్నంపెట్టిన వారిని దుర్భాషలాడుతున్నాడన్నారు. 

లోకేశ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే, తనమంత్రిపదవి ఉంటుందని నానీ  భావిస్తున్నట్టున్నాడని, ఆయనకు  లోకేశ్ కు పందికి, హంసకు ఉన్నంత తేడా ఉందనే నిజాన్నికొడాలి తెలుసుకుంటే మంచిదని మాణిక్యరావు స్పష్టంచేశారు. లోకేశ్ హంసలాంటివాడని, ఆయనతో దేనిలోనూ నానీ సరిపోడన్నారు.

నానీ పందో, పందిస్వభావమున్న మనిషో తెలియాలంటే, ఆయన నేరుగా  వరదబాధితప్రాంతాలకు వెళ్లి, బాధితులను పరామర్శించి ఉండాల్సిందని మాణిక్యరావు సూచించారు. వరదప్రాంతాల్లో పర్యటించడం చేతగాని వైసీపీనేతలు, మంత్రులు, బాధితులకు రూపాయిసాయంచేయని వారు, లోకేశ్ పై విమర్శలు చేస్తున్నారన్నారు.

లోకేశ్ పర్యటనతో ఎక్కడ తమను ప్రజలు నిలదీస్తారోనన్న భయంతోనే వారంతా ఆయనపై విమర్శలకు దిగారని మాణిక్యరావు తేల్చిచెప్పారు. లోకేశ్ తో ఏ విషయంలోనైనా పోటీపడే కనీస అర్హత నానీకి లేదని, అటువంటి వ్యక్తి టీడీపీ యువనేతపై విమర్శలు చేయడమేంటన్నారు? స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ము,ధైర్యం లేనివారు ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments