Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మనబడి నాడు-నేడు' కార్యక్రమాలను వేగవంతం చేయండి : మంత్రి సురేష్

'మనబడి నాడు-నేడు' కార్యక్రమాలను వేగవంతం చేయండి : మంత్రి సురేష్
, ఆదివారం, 26 జులై 2020 (09:50 IST)
మనబడి నాడు-నేడు కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఇంచార్జి మంత్రి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎర్రగుంట్లలో ఉన్న భారతి సిమెంట్స్ అతిధి గృహంలో కడప జిల్లాలో జరుగుతున్న మనబడి నాడు-నేడు కార్యక్రమాల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ పాఠశాలలో తొమ్మిది రకాల మౌళిక వసతులతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత  నవంబర్ 14న శ్రీకారం చుట్టారన్నారు.

వై ఎస్ ఆర్ జిల్లాలో మొత్తం 3253 పాఠశాలలుండగా, అందులో మొదటి విడతగా 1040 పాఠశాలల్లో 9 రకాల మౌళిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిన్షన్లను పెంచేదిశగా జగనన్న గోరుముద్ద అయితేనేమి, పాఠశాలలు పునః ప్రారంభమైన  వెంటనే జగనన్న విద్యాకానుక అనే పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విప్లవాత్మకమైన మార్పులతో విద్యావ్యవస్థను మరింత పటిష్టపర్చడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారన్నారు. 

మనబడి నాడు-నేడు కార్యక్రమాలను నిర్దేశించిన పాఠశాలల్లో పనులను యుద్ధప్రాతిపదికన త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కడప జిల్లాలో మూడు డెమో, 45 మోడల్ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌళిక వసతులతో అభివృద్ధి చేసి మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలన్నారు. 

అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్బా రెడ్డి, విద్యా శాఖ ఆర్జేడీ వెంకట కృష్ణా రెడ్డి, డీఈఓ శైలజ, సమగ్ర శిక్ష అభియాన్ పీవో ప్రభాకర రెడ్డి,  ఏపీఈడబ్లుఐడిసి ఎస్ ఈ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ