Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి: మంత్రి ఆదిమూలపు సురేష్

Advertiesment
Schools
, గురువారం, 12 డిశెంబరు 2019 (20:28 IST)
రాష్ట్రంలో బడి రూపు మార్చేందుకు ప్రజాప్రతినిధులంతా నడుం బిగించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని, కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులు,  ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

పాఠశాలల రూపు మార్చటం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న నాడు - నేడు కార్యక్రమం లో భాగస్వాములమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన అన్నారు. గురువారం సచివాలయం లోని 5వ బ్లాక్ లో పలువురు మంత్రులు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం  జిల్లాల ఎమ్మెల్యేల తో  ఈ కార్యక్రమం పై సమావేశం జరిగింది. నాడు -నేడు పై వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ 
 
విద్యావ్యవస్థ లో తీసుకుంటున్న సంస్కరణలతో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నాడు - నేడు ను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. నూతన నిర్మాణ పనుల భాద్యత పేరెంట్స్ కమిటీల ద్వారా జరుగుతుదన్నారు. బిల్లుల చెల్లింపు కోసం చెక్ లపై ఫీల్డ్ ఇంజనీర్, ప్రధానోపాధ్యాయులు తో పాటు పేరెంట్స్ కమిటీ లోని  ముగ్గురు సభ్యులను బాద్యులుగా చేస్తున్నామని వివరించారు.

దీనిపై కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎక్కువమందిని భాగస్వాములు గా చేయటం వల్ల పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయని సూచించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ చెక్కుపై ఎక్కువమంది సంతకాలు ఉండటం ఇబ్బంది అయితే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి రూపాయికి లెక్క చూపే విధంగా పేరెంట్స్ కమిటీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు.

అంచనాలు రూపొందించే ఇంజనీర్లు కూడా పాఠశాలల లైఫ్ 75 సంవత్సరాలు ఉండే విధంగా డిజైన్ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. మొదటి  విడతగా రాష్ట్రం లో 15, 715 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి చేసె మొత్తం 9 అంశాలను మంత్రి సురేష్ వివరించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్థాయి లో కలెక్టర్ చైర్మన్ గా కమిటీ ఉంటుందని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఉపాధిహామీ నిధులతో అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు, సలహాలు, సూచనలను మంత్రులు, ఎమ్మెల్యే లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి సురేష్ చెప్పారు. సమావేశం లో నాలుగు  జిల్లాల ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

150 మంది ఒక్కసారే వస్తే ఏం చేస్తావ్ బాబు.. రోజా ప్రశ్న?