Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తా.. రఘువీరా రెడ్డి..

కాంగ్రెస్ నేత...అందులోను ఎపి కాంగ్రెస్‌కు అధ్యక్షులు ఇలా మాట్లాడమేంటి అనుకుంటున్నారా.. అయితే ఇందులో ఒక పెద్ద చిక్కే ఉంది. తన సొంత నియోజకవర్గమైన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్త

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (22:30 IST)
కాంగ్రెస్ నేత...అందులోను ఎపి కాంగ్రెస్‌కు అధ్యక్షులు ఇలా మాట్లాడమేంటి అనుకుంటున్నారా.. అయితే ఇందులో ఒక పెద్ద చిక్కే ఉంది. తన సొంత నియోజకవర్గమైన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు రఘువీరారెడ్డి. అదే చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తానంటున్నారు. రఘువీరారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
 
కళ్యాణదుర్గంలో గత  కొన్నినెలలుగా నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జనవరి 2వ తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో తమ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నీటి సమస్యను పరిష్కరిస్తామని స్థానిక టిడిపి నేతలు హామీ ఇస్తున్నారు. అయితే అదంతా నేను నమ్మను. నాకు మాటలు కాదు చేతలు కావాలి. 
 
కళ్యాణదుర్గంలో నీటి సమస్యను తీరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయను. నామినేషన్ కూడా వేయను. టిడిపి అభ్యర్థి గెలుపుకు దగ్గరుండి సపోర్ట్ చేస్తానంటూ ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమంలో రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే చెరువులను అభివృద్థిని ఎలాగో ప్రభుత్వం చేయదు కాబట్టి రఘువీరారెడ్డి అంత ధైర్యంగా మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments