Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజాను అనవసరంగా రొంపిలోకి దింపా... ఏం చేయాలో అర్థంకావడంలేదు : ఎంపి సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా రోజా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె వ్యవహారశైలి అలా ఉంది. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశా. చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున

Advertiesment
TDP MP Sivaprasad
, శనివారం, 23 డిశెంబరు 2017 (15:54 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా రోజా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె వ్యవహారశైలి అలా ఉంది. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశా. చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నానన్నారు శివప్రసాద్. 
 
నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు రోజా. ఎందుకు అలా మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదు. ప్రజాప్రతినిధులంటే సంయమనం పాటించాలి. ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసర విమర్శలు చేయడం మానుకోవాలి. మనం ఒకరిపై బురద జల్లాలని ప్రయత్నిస్తే ఆ బురద మనపైన పడుతుందని తెలుసుకోవాలి. 
 
ఈ విషయం రోజా ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే రోజా గురించి చర్చ జరగడం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు శివప్రసాద్. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్‌గా ఇస్తామన్నారాయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బూటు కాలితో తన్నడం సరే.. వీడియో ఎవరు తీశారో తేలుస్తాం : డీసీపీ విశ్వప్రతాప్