హైదరాబాద్‌లో లాక్డౌన్ ఊహాగానాలు : రూ.వెయ్యికోట్లకు మద్యం అమ్మకాలు

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:59 IST)
హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా గణనీయంగా పెరిగాయి. ఫలితంగా గత నెలాఖరులో ఏకంగా రూ.1000 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా, జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 
 
జూలై 1 నుంచి లాక్డౌన్‌ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. మొత్తమ్మీద  కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో చేయూతనిస్తోందని చెప్పొచ్చు. 
 
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్‌ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి. 
 
లాక్డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మద్యం దొరక్క ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments