Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగారు వ్యాపారి బర్త్‌డే పార్టీ.. హాజరైన ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్!!

Advertiesment
బంగారు వ్యాపారి బర్త్‌డే పార్టీ.. హాజరైన ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్!!
, ఆదివారం, 5 జులై 2020 (09:12 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు పోలీసులు, ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా నగర వాసులే కాదు ఏకంగా మంత్రులు కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బంగారు వ్యాపారి పుట్టినరోజు పార్టీకి ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. వారిద్దరూ ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, పుట్టినరోజు పార్టీ జరుపుకున్న వ్యాపారి ఏకంగా కరోనా వైరస్ సోకి మరణించడం ఇపుడు మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హిమాయత్‌నగర్‌లో నివసించే ఓ బంగారు వ్యాపారి (63) పుట్టిన రోజు వేడుకలు గత నెల 22న ఘనంగా జరిగాయి. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం 150 మందికిపైగా ఈ వేడుకకు హాజరయ్యారు.
 
పార్టీ జరిగిన రెండు రోజుల తర్వాత వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండటంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అనుమానించిన వైద్యులు మందులు రాసిస్తూనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
మందులు వాడుతున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో అనుమానించిన వ్యాపారి ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే, పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆ మరుసటి రోజే అతడు మరణించాడు.
 
ఆ తర్వాత ఐదు రోజులకే ఈ పార్టీలో పాల్గొన్న జ్యూవెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా ఐదు రోజుల క్రితం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనికితోడు పార్టీకి హాజరైన వారిలో 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ వేడుకకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పుడీ విషయం తెలిసి వణికిపోతున్నారు. దీంతో వీరంతా రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసి పెళ్ళి ఊరేగింపు... వరుడిని జైల్లో పెట్టిన పోలీసులు