Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి దక్కలేదనీ యువకుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:13 IST)
ప్రేమించిన యువతి దక్కక పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వివాహానికి విముఖత తెలపడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ దామోదర్ అందించిన వివరాల ప్రకారం, ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్న మల్లేష్‌ అనే ప్రభుత్వ ఉద్యోగికి సాయికిరణ్‌ (27) అనే కుమారుడు ఉన్నాడు. 
 
పాల వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న సాయి కిరణ్ గత కొద్ది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఆ యువతితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కానీ ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికిరణ్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తర్వాత ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments