Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించే సమయంలో నీవే సర్వస్వం అన్నాడు.. పెళ్లయ్యాక వరకట్న వేధింపులు... టెక్కీ సూసైడ్

హైదరాబాద్‌లో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్లయ్యాక వరకట్నం కావాలంటూ వేధించాడు. దీంతో పెళ్లయి ఐదు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీల

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:53 IST)
హైదరాబాద్‌లో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్లయ్యాక వరకట్నం కావాలంటూ వేధించాడు. దీంతో పెళ్లయి ఐదు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రుపిని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తమామల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. రుపినికి ఐదు నెలల క్రితమే వివాహమైంది. రుపిని భర్త సందీప్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. రుపిని అసలు పేరు పుష్పలత. 
 
ఏలూరుకు చెందిన పుష్పలత అలియాస్ రుపి అనే యువతి సందీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే ప్రాంతం కావడం వల్ల పెద్దలు కూడా వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారు. ఆరు నెలల క్రితం సందీప్, పుష్పలత హైదరాబాద్ నగరానికి వచ్చి నివాసముంటున్నారు. రుపిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. సందీప్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు.
 
వివాహమైన నాలుగు నెలల వరకు వారి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత వరకట్నం కావాలంటూ సందీప్ భార్యను వేధించసాగాడు. భర్త వేధింపుల గురించి ఆమె తల్లిదండ్రులతో చెప్పుకుని వాపోయింది కూడా. ఈ క్రమంలో రుపిని తండ్రి మురళీకృష్ణ రెండు రోజుల క్రితమే చిత్రపురి కాలనీలో ఉంటున్న ఇంటికి వచ్చారు. కూతురికి రావాల్సిన వాటా ఇస్తానని అల్లుడికి సర్ది చెప్పి వెళ్లిపోయాడు. 
 
కానీ రుపినికి వేధింపులు మాత్రం తప్పలేదు. ఆమె తండ్రి వెళ్లిపోగానే మళ్లీ సందీప్ వేధించసాగాడు. శనివారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. వీటిని మళ్లీ తల్లిదండ్రులకు చెప్పుకోవడం ఇష్టం లేక తీవ్రమనస్తాపంతో ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments