Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమన్నందుకు అక్కడ కర్రపెట్టి గాయపరిచారు...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:42 IST)
హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఓ మహిళపై ముగ్గురు సామాహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని వత్తిడి చేసిన మహిళను... తన స్నేహితులతో కలిసి సామాహిక అత్యాచారం చేయించాడు. వారినుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు అత్యాచార సమయంలో ఆ మహిళ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మహిళ ప్రైవేట్ భాగాల్లో కర్రలుచొప్పించి గాయపరిచారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటకు చెందిన 32 యేళ్ళ మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తోంది. ఈమె ఓ ప్రైవేటు బీమా కంపెనీలో పని చేస్తోంది. ఈ క్రమంలో మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారి మనోజ్‌ కుమార్‌ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో గత కొన్ని నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె మనోజ్‌ కుమార్‌పై ఆమె ఒత్తిడి చేయసాగింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. గత సోమవారం ఆమె మనోజ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి.. స్నేహమై నగర్‌ కాలనీలోని ఉన్న తన స్నేహితుల ఇంటికి పిలిపించాడు. అక్కడికి వచ్చిన బాధితురాలి పట్ల మనోజ్‌కుమార్‌ అతని స్నేహితులు అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక అతని స్నేహితులు కోహెడ గ్రామానికి చెందిన కొలను సిద్దార్థరెడ్డి, మీర్‌పేటకు చెందిన సతీష్, బాబీ, జంగారెడ్డి మద్యం మత్తులో తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ మద్యంమత్తులో వారు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments