Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో అమ్మాయిని వాడేసుకున్న యువకుడు...

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (13:25 IST)
ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. లైంగికంగా వాడుకున్నాడు. పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని తన రూమ్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మోసగాడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన యువతి (20) ప్రస్తుతం కొత్తపేటలోని ఓ దవాఖానలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పని చేస్తుంది. ఇదే జిల్లాలోని హాలియా మండలం, ఎల్లాపూర్‌ తండాకు చెందిన కొర్రా గోవింద్‌ నాయక్‌ (23) ఎల్బీనగర్‌ గుంటి జంగయ్య కాలనీలో నివాసముంటున్నాడు. 
 
ఈ క్రమంలో సదరు యువతి సెల్‌ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నాను.. పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి లొంగిపోయి.. సర్వం సమర్పించుకుంది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని తన రూమ్‌కు తీసుకెళ్లి గోవింద్ నాయక్.. ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గోవింద్ నాయక్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం