అత్తారింట్లోకి బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే ఓ కామాంధుడు రహస్యంగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఎలాగో ఆమె వాట్సాప్ నెంబర్ సంపాదించాడు. ఓ రోజు భర్త ఇంట్లో లేని సమయం చూసి.. ఆమెకు బాత్రూమ్ నగ్న ఫోటోలు పంపాడు. తన దగ్గర చాలా ఫొటోలు ఉన్నాయనీ, వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే... రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, ఎస్సార్ నగర్‌కు చెందిన అరుణ్‌తో పెళ్లైంది. వాళ్లకు రెండేళ్ల పాప వుంది. ఆమె స్నానం చేస్తున్నప్పుడు అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే నీచుడు రహస్యంగా ఫోటోలు తీశాడు. ఆమెకే పంపాడు. భర్తకు తెలిస్తే లేనిపోని మనస్పర్థలు వస్తాయేమోనన్న భయంతో తనలో తనే మదన పడుతూ... చిన్నప్పటి నుంచీ దాచుకున్న రూ.4 లక్షలు అతని చేతిలో పెట్టింది.
చివరికి బాధితురాలు కామాంధుడి బెదిరింపులను తాళలేక.. భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి భర్తతో మనస్పర్ధలు తప్పలేదు. వెంటనే పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త కూడా ఇంటికి రమ్మని వేధించడం మొదలెట్టాడు.
ఈ వ్యవహారంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యాన్‌కి చీర బిగించి, మెడకు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. తాను ఆమెను వేధించలేదనీ... తనను తప్పుపట్టవద్దనీ, అంతా ఆ బ్లాక్ మెయిలర్ వల్లే జరిగిందనీ ఆమె భర్త అరుణ్ అంటున్నారు. బాధితురాలు మరణానికి తర్వాత పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.