Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్ పరిచయం.. హోటల్‌కు వెళ్తే కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి?

ఫేస్‌బుక్ పరిచయం.. హోటల్‌కు వెళ్తే కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి?
, శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:11 IST)
హైదరాబాదులో మహిళపై ఘోరం జరిగింది. నమ్మిన మహిళను ముంచేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాన్ని వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి రూ.50 లక్షల వరకు వసూలు చేశాడు.

ఈ ఘటన బాధితురాలి ద్వారా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని బీదర్‌కు చెందిన సంజీవ్ రెడ్డి ఫ్యామిలీ నిజాంపేటలో స్థిరపడింది. కొన్నేళ్లుగా భార్య కావేరీ, మేనల్లుడు విశాల్ రెడ్డితో కలిసి నగరంలోనే నివాసముంటున్నాడు సంజీవ్ రెడ్డి.
 
ఐతే గతంలో అమెరికాలో ఉండి ప్రస్తుతం కోకాపేట్‌లో నివసిస్తున్న ఓ మహిళ.. ఫేస్‌బుక్ ద్వారా సంజీవ్‌రెడ్డికి రెండేళ్ల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం ఇద్దరిని కలిసేలా చేసింది. అలా ఓ రోజు ఓ హోటల్‌కు ఆహ్వానించాడు సంజీవ్. అక్కడ తన భార్య, మేనల్లుడికి పరిచయం చేశాడు. ఐతే ఆమె భోజనంచేసేందుకు నిరాకరిండచంతో ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 
 
అనంతరం ముగ్గురూ కలిసి ఆమెను కారులో తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై సంజీవ్ రెడ్డి అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసిన సంజీవ్ రెడ్డి.. అడిగనంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అలా నెలకు కొంత చొప్పున బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ బెదిరింపులకు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంజీవ్ రెడ్డితో పాటు అతడి భార్య కావేరీ, మేనల్లుడు విశాల్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిలవని పేరంటానికి వచ్చారు.. పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు