Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనుండగా ఇంకొకతి కావాల్సివచ్చిందిరా... భర్తను యువతిని చితక్కొట్టిన భార్య

Webdunia
గురువారం, 25 జులై 2019 (12:43 IST)
ఓ మహిళ అపరభద్రకాళిగా మారిపోయింది. తనను నిర్లక్ష్యానికి గురిచేస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను చితక్కొట్టింది. పనిలో పనిగా తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కూడా ఆమె చావబాదింది. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరంలో కొత్తకొమ్మగూడెంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి సౌజన్య అనే మహిళను ఇచ్చి పెద్దలు పెళ్ళి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యను వదిలిపెట్టిన లక్ష్మణ్... తరచుగా కూకట్‌పల్లికి వెళ్లి వచ్చేవాడు. 
 
అక్కడి ప్రగతినగర్‌లో నివసించే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె... తనకు అన్యాయం చెయ్యవద్దని కోరింది. అయినా లక్ష్మణ్ పట్టించుకోలేదు. అలాగైతే... తనకు విడాకులు ఇచ్చేయమని కోరింది. అయినప్పటికీ విడాకులు ఇవ్వకుండా నాటకాలు ఆడసాగాడు.
 
ఈ సమస్య మరింతగా జఠిలమైంది. తనతో పాటు పిల్లల బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం మానేశాడు. ఏం చెయ్యాలో, తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఆ మహిళకు అర్థం కాలేదు. తన పిల్లల భవిష్యత్ తలసుకుని కుమిలిపోయింది. 
 
ఇక లాభంలేదని గ్రహించిన ఆమె.. తన భర్త రాకపోకలపై దృష్టిసారించింది. తన బంధువులతో కలిసి... తిన్నగా ప్రగతి నగర్ వెళ్లి... అతన్ని, ఆమెనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దర్నీ చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. చెప్పుతో కొట్టారు. ఆ తర్వాత ఇద్దర్నీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments