Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా కాన్సులేట్.. సీఎం సమీక్ష

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుగా వ్యాపిస్తోంది. శనివారం మరో కేసు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో తొలి కరోనా వైరస్ కేసు ఇక్కడే నమోదైంది. ఆ రోగి 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నాడు. ప్రస్తుతం అతన్ని శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో శనివారం మరో కేసు నమోదైంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి కరోనా వైరస్ లక్షణాలతో వచ్చే రోగులను నేరుగా ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆంబులెన్స్‌లను సిద్ధం చేశారు. 
 
దీనిపై వైద్యఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కరోనాపై శనివారం అత్యున్నత నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు వెంటనే ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. 
 
ఎంత ఖర్చయినా ప్రజల ఆరోగ్యం కాపాడతామని మంత్రి పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో ఐసోలేటెడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మల్లయ్య ఏర్పాట్లను పరిశీలించారు.
 
మరోవైపు, క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. అమెరికా కాన్సులేట్ వీసా అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి వీసాల కోసం నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు యూఎస్ ఎంబ‌సీకి చెందిన వెబ్‌సైట్ పేర్కొన్న‌ది. 
 
కోవిడ్‌19 వ్యాధి మహ‌మ్మారిగా మార‌డంతో అమెరికా కాన్సులేట్ ఈ చ‌ర్య‌కు పూనుకున్న‌ది. ఇమ్మిగ్రెంట్‌, నాన్ ఇమ్మిగ్రెంట్‌ కేట‌గిరీల్లో ద‌ర‌ఖాస్తున్న చేసుకున్న వారికి నిర్వ‌హించాల్సిన అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఆ నోటిఫికేష‌న్‌లో తెలిపారు. అయితే మ‌ళ్లీ కాన్సులేట్ ఆప‌రేష‌న్స్‌ మొద‌లైన త‌ర్వాత‌.. అభ్య‌ర్థులు కొత్త అపాయింట్మెంట్ తీసుకోవ‌చ్చు అని వెబ్‌సైట్‌లో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం