Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందేస్తూ.. చిందెయ్‌రా.. చిందేస్తూ.. మందెయ్‌రా... లిక్కర్ మత్తులో యువత

'మందేస్తూ.. చిందెయ్‌రా.. చిందేస్తూ.. మందెయ్‌రా..' ఇది ఓ చిత్రంలోని పాట. తెలంగాణ యువకులు మద్యాన్ని తెగతాగేస్తున్నారు. ముఖ్యంగా బీర్ బాటిల్స్ క్షణాల్లో కేసుల కొద్దీ అమ్ముడుపోతున్నాయి. దీంతో లిక్కర్ కిక్

Webdunia
గురువారం, 3 మే 2018 (11:04 IST)
'మందేస్తూ.. చిందెయ్‌రా.. చిందేస్తూ.. మందెయ్‌రా..' ఇది ఓ చిత్రంలోని పాట. తెలంగాణ యువకులు మద్యాన్ని తెగతాగేస్తున్నారు. ముఖ్యంగా బీర్ బాటిల్స్ క్షణాల్లో కేసుల కొద్దీ అమ్ముడుపోతున్నాయి. దీంతో లిక్కర్ కిక్కు కొత్త పుంతలు తొక్కుతోంది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిమిని తట్టుకునేందుకు యువత ఇష్టానుసారంగా బీర్లు తాగేస్తోంది. దీంతో టీనేజర్స్‌తో బార్లు, పబ్బులు కిటకిటలాడుతున్నాయి. వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు యూత్ తాగుబోతులుగా మారుతున్నారు. ఫలితంగా బార్లు, పబ్బులు, వైన్స్ షాపుల్లో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. 
 
గ్రేటర్‌లో రోజూ 1.30 లక్షల లీటర్ల బీరును తాగేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఏప్రిల్, మే నెలల్లో రోజూ లక్ష లీటర్లకు మించని బీర్ల సేల్స్.. ఈ సారి 30 వేల లీటర్లు అదనంగా పెరగడం గమనార్హం. యూత్ జోష్‌తో ఒక్క గ్రేటర్‌లోనే 500 బార్లు, పబ్బుల్లో సేల్స్ చీర్స్ అదుర్స్ అని వ్యాపారులు అంటున్నారు. 
 
దీంతో రోజుకు ఒక్క గ్రేటర్‌లోనే రూ.24 కోట్ల బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బీర్లు తాగడంలో టీనేజర్స్ ఉన్నట్లు తేలితే బార్లు, పబ్బులు, వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని అబ్కారీ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments