Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తిని అపస్మారక స్థితిలో ఇద్దరు మహిళలు.. ఏమైంది?

Webdunia
గురువారం, 23 జులై 2020 (11:42 IST)
మాంసాహారం తీసుకున్న ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. చికెన్‌ కూర తినడం వల్లే వారు అనారోగ్యానికి కారణమయ్యారని వైద్యులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చందానగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన టైలరింగ్‌ పని చేసే గంగాధర్‌ వద్ద ఇద్దరు పని చేస్తున్నారు. వారు మంగళవారం మధ్యాహ్నం చికెన్‌ తెచ్చి ఓ మహిళకు ఇచ్చి వండమని చెప్పారు. 
 
వండిన చికెన్‌లో కొంత భాగాన్ని ఆ మహిళకు ఇచ్చారు. ఆమె తన కూతురు (15)తో పాటు కొడుకుకూ చికెన్‌ పెట్టి, తానూ తింది. సాయంత్రం భర్త వచ్చిచూడగా అపస్మారక స్థితిలో భార్య, కూతురు, కొడుకు పడివున్నారు. దీంతో చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.
 
చికెన్ కూర తిన్న తర్వాత ఇద్దరు మహిళలు మత్తులోకి జారుకున్నారని తెలిసింది. భర్త ఇంటికి వచ్చి చూసే సమయంలో స్పృహలో లేరని ఇరుగుపొరుగువారి సహాయంతో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఫిర్యాదు ఆధారంగా, చందానగర్ పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ మహిళలపై లైంగిక వేధింపులు జరిగివుంటాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వైద్య పరీక్షల్లో వారిపై లైంగిక వేధింపుల జాడలు లేవని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం