Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జి గదిలో 3 గంటలు గడిపి వీడియో తీసింది.. తర్వాత బెదిరించింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:23 IST)
సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒక వైపు మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు మహిళల వల్లే మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువకుడిని లాడ్జికి రప్పించుకున్న మహిళ, ఆపై తన స్నేహితుడితో కలిసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు.
 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, కూకట్ పల్లి, కావూరీ హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడికి, సోషల్ మీడియాలో 22 ఏళ్ల యువతి పరిచయమైంది. ఈ పరిచయం కారణంగా వీరిద్దరూ కలిశారు. ఈ నెల 14న కూకట్ పల్లి పరిధిలోని ఓ లాడ్జ్ లో మూడు గంటల పాటు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో యువతి రహస్యంగా వీడియోలు తీసింది.
 
ఆపై తన స్నేహితుడు సంతోష్ (32) తో కలిసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బివ్వకుంటే తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించింది. దీంతో భయపడిన బాధితుడు నాలుగు లక్షల వరకు డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీని ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఆపై, డబ్బును స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments