Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కళ్లలో కారంచల్లి సవతి తల్లి మెడ నరికేసిన కానిస్టేబుల్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:35 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆస్తి కోసం సవతి తల్లిని అడ్డంగా నరికేశాడు. కళ్ళలో కారంచల్లి చంపేశాడు. తండ్రి చనిపోయి రెండు నెలలు పూర్తికాకముందే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటకు చెందిన యాదయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. అనారోగ్యం కారణంగా యాదయ్య ఇటీవలే చనిపోయాడు. దహన కార్యక్రమంలో కూడా పెద్ద భార్య కొడుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆస్తి కోసం గొడవ పడటంతో స్థానిక పోలీసులు వచ్చి సముదాయించి, అంత్యక్రియలు పూర్తి చేయించారు. 
 
యాదయ్య పెద్ద కుమారుడు శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్. ఈయనకు తండ్రి యాదయ్య జీవించివున్న సమయంలోనే బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లును రాసిచ్చాడు. అయితే, తన సవతి తల్లికి రాసిచ్చిన ఆస్తి కూడా తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఉదయం మాదన్నపేట్‌లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి.. ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల కళ్లలో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగా హత్య చేశాడు. 
 
కళ్ల ఎదుటే తల్లి హత్య చూసిన ఇద్దరు పిల్లలు భయబ్రాంతులకుగురై కోలుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఈ ఘటన జరిగిన అనంతరం కానిస్టేబుల్ పరారయ్యాడని తెలుస్తోంది. స్థానిక సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments