Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:36 IST)
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. లాకర్‌లో ఉన్న 17 కేజీల బంగారం, పెట్టెలోని రూ.2.66 లక్షల నగదు అపహరణకు గురైంది.

ఈ చోరీ సోమవారం వెలుగులోకొచ్చింది. శుక్రవారం విధులు పూర్తయిన తర్వాత సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లారు. శని, ఆదివారం కార్యాలయానికి సెలవు. అయినప్పటికీ మేనేజర్‌ పురుషోత్తం శనివారం బ్యాంకుకు వచ్చి మధ్యాహ్నం వరకు పనిచేసి వెళ్లారు.

సోమవారం ఉదయం సిబ్బంది విధులకు హాజరుకాగా.. అప్పటికే బ్యాంకులో సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ కన్పించలేదు. నగదు పెట్టెలోని రూ.2.66 లక్షలు కూడా మాయమైనట్టు నిర్ధారించారు. దీంతో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులకు అక్కడ చోరీ జరిగిన ఆనవాళ్లు (తాళాలు, గోడ పగులగొట్టడం వంటివి) కనిపించలేదు.

దాంతో అనుమానం వచ్చి బ్యాంకు లాకర్‌ను తెరిపించి చూడగా.. అందులోని బంగారం మొత్తం మాయమైంది. ప్రాథమిక విచారణలో రూ.3.45 కోట్లు విలువచేసే 17 కిలోల బంగారం అపహరణకు గురైనట్టు తేలినట్టు సమాచారం. బ్యాంకు మేనేజరును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments