Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్‌లో మత్తు కలిపి... తల్లీకూతుళ్లపై ఇంటి యజమాని అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (23:02 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో దారుణం జరిగింది. చికెన్‌ కూరలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఇంటి యజమాని... ఆ తర్వాత తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి ఇంటి యజమాని స్నేహితులు కూడా పాలుపంచుకున్నారు. అలాగే, అతనికి ఓ మహిళ సహకారం అందించినట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్‌కు చెందిన గంగాధర్‌ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి అద్దెకు నివసిస్తున్నారు. అయితే, కూలి పని చేరుకొని జీవనం సాగించే వీరిలో అద్దె ఇంట్లో నివసించే మహిళకు, ఆమె కుమార్తెకు మత్తు పదార్థం కలిపిన చికెన్‌ కూర ఇచ్చాడు. 
 
దీన్ని ఆరగించిన కొద్దిసేపటికే మహిళ, ఆమె కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. అనంతరం గంగాధర్‌, అతని ఇద్దరు స్నేహితులు మైనర్‌ బాలిక, ఆమె తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఇంటి యజమాని, అతని స్నేహితులకు మరో మహిళ సాయం చేసిందని స్థానికులు తెలిపారు. 
 
ఈ క్రమంలో కూలి పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్తకు భార్య, కూతురు, కుమారుడు స్పృహలో లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో స్థానికులకు, దాంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments