Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార కూపంలోకి నెడుతున్న మహిళల్లో ఏపీ మొదటి స్థానం : నారా లోకేశ్

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:34 IST)
వ్యభిచారం కూపంలోకి నెడుతున్న మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో మహిళలు అత్యంత పేదరికంలో బాధపడుతున్నారని, పేదరికంతో వారు పడుతున్న బాధలు, అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు చెప్పారు.
 
ముఖ్యంగా, ఏపీలోని మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నారని చెప్పారు. ఈ సంఖ్యలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. 
 
ఇలాంటి విషయాలపై పోలీసులు ఏమాత్రం దృష్టిసారించడం లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
 
రాష్ట్రంలో 15 నుంచి 19 మధ్య వయసున్న యువతులు గర్భందాలుస్తున్న వివరాలతో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాలను లోకేశ్ షేర్ చేశారు. ఈ జాబితాలో ఏపీలో 12.6 శాతం మంది టీనేజ్ యువతులు గర్భం దాలుస్తున్నట్టుగా ఉంది. జాతీయ సరాసరి శాతం 6.8 శాతంగా ఉంది. 
 
మన దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న వ్యభిచారం వివరాలను కూడా లోకేశ్ పంచుకున్నారు. భారత్‌లో 8.50 లక్షల మంది వ్యభిచార వృత్తిలో ఉండగా... ఏపీ నుంచే 1,33,447 మంది మహిళలు వ్యభిచారం చేస్తున్నారు. ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments