Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉజ్జయినిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆటో డ్రైవర్ అరెస్టు

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పెట్టణ సమీపంలో మైనర్ బాలికపై దారుణ అత్యాచారం ఘటనలో ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆటోలో రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. సదరు ఆటోడ్రైవర్ 38 ఏళ్ల రాకేష్‌గా తెలిపారు. 12 ఏళ్ల బాధిత బాలిక అత్యాచారం తర్వాత అర్థనగ్న స్థితిలో, రక్తస్రావం అవుతుండగా, 8 కిలోమీటర్ల పాటు సాయం కోరుతూ చివరికి ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించడం తెలిసిందే.
 
పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఎనిమిది కిలోమీటర్ల పొడవునా సీసీటీవీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీంచారు. వీటిలో జీవన్ భేరి ప్రాంతంలో బాలిక ఆటో ఎక్కినట్టు గుర్తించారు. ఘటనకు ఒక రోజు ముందు బాలిక తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
బాలిక ఇంటి నుంచి వచ్చిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని కలుసుకున్నట్టు చెప్పారు. బాలిక ఎవరిని అయితే కలుసుకుందో, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. ఆటోలో రక్తపు మరకలు ఎవరివనేది గుర్తించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
అత్యాచారం తర్వాత బాలిక వీధుల్లో నడుస్తూ కనిపించిన వారిని సాయం కోరినా, ఎవరూ చేయకపోగా, తరిమి కొట్టడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చివరికి ఓ ఆశ్రమం నిర్వాహకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments