Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ స్మగ్లింగ్.. మనీ లాండరింగే కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:40 IST)
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ ఖైరా సింగ్‌‍ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత 2015లో నమోదైన కేసు ఆధారంగా గురువారం ఉదయం ఆయన నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్‌ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు., 
 
ఈయనపై పోలీసులు పలు అభియోగాలు మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్, అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాగా అండదండలు అందించడం, వారికి ఆవాసం కల్పించడం, వారి నుంచి ఆర్థిక లబ్ధి పొందడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్మగ్లర్ల నుంచి తీసుకున్న డబ్బుతో ఆయన విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని విచారణ సంస్థ అభియోగాలు మోపింది. 
 
గత 2014 నుంచి 2020 మధ్య కాలంలో సుక్పాల్ సింగ్ తన కోసం, తన కుటుంబం కోసం రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఈ మొత్తం డిక్లరేషన్‌లో ఆయన పేర్కొన్న దాని కంటే ఎక్కువని పోలీసులు చెపుతున్నారు. మరోవైపు పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహిస్తుండటాన్ని ఆయన ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియోలో ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్నట్టు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments