Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:27 IST)
. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. గత ఏడాది ఏప్రిల్‌ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని, ఎన్నికలు రద్దు చేస్తూ, హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.  దీనితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌లో ఉత్కంఠ తొల‌గి, కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించిన‌ట్ల‌యింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments