శ్రీకాకుళంలో ఒక బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం చై,నా. సంస్థలపై విరుచుకుపడ్డారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి శుద్ధ వేస్ట్ అన్నట్లు ఓపెన్ గా చెప్పేశారు.
శ్రీ చైతన్య, నారాయణ అంటూ తల్లిదండ్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారికెవరికీ పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ లేదు. అక్కడంతా ఏబీసీడీఎఫ్ అని బట్టీ పట్టించడమే తెలుసు. వారు పిల్లల మెదడును మానుప్లేట్ చేస్తారు...అంటూ తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ కలిగిన వారని, వారి ముందు శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటీచర్లు బలాదూర్ అని స్పీకర్ తమ్మినేని వివరించారు. కావాలంటే, తాను ఒక సవాల్ చేస్తున్నా అని, దమ్ముంటే శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ముందుకు రావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కింతలిలోని జెడ్పీహెచ్ స్కూల్‌లోని టీచర్లతో శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటీచర్లు పోటీకి రావాలంటూ తమ్మినేని ఛాలెంజ్ చేశారు.