Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో హైకోర్టు కాదు.. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్

Webdunia
సోమవారం, 8 మే 2023 (11:35 IST)
2024లో జరిగే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు కాదని హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆయన యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో భాగంగా, కర్నూరులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు న్యాయవాదులు కలుసుకుని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 
 
వారితో నారా లోకేష్ ముచ్చటిస్తూ, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తమది సీఎం జగన్‌ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్‌ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్‌ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments