Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ నాకు శ్రేయోభిలాషి, ఆయ‌న‌తో క‌లిసి భోజ‌నం చేశా...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:14 IST)
ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీ హీరో నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరి కొందరు సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
 
సీఎం జ‌గ‌న్ నాకు శ్రేయోభిలాషి... క‌లిసి చాలా రోజులు అయింది. ఈ రోజు విజ‌య‌వాడ‌కు రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జ‌గ‌న్ తో క‌లిసి భోజ‌నం చేశా... అని హీరో నాగార్జున చెప్పారు. మీరు ఏఏ అంశాల‌పై చ‌ర్చించార‌ని ప్ర‌శ్నిస్తే, ఆయ‌న ఒక న‌వ్వు న‌వ్వేసి కారు ఎక్కేశారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చి, తిరిగి హైద‌రాబాదుకు ప‌యనం అయ్యారు నాగార్జున‌.
 
సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశాలపై ఒక చ‌ర్చ జ‌ర‌గాలి అని నిర్మాత‌లు, హీరోలు క‌లిసి నాగార్జున‌ను సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపార‌ని స‌మాచారం. మా ఎన్నిక‌లు జ‌రిగి, మంచు విష్ణు అధ్య‌క్షుడు కాగా, ఆయ‌న ప్ర‌మేయం కూడా లేకుండా నేరుగా నాగార్జున సీఎం జ‌గ‌న్ ని క‌లిశారు. నాగార్జున చేసిన ఈ రాయ‌బారం ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లం అవుతుందో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments