Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు...ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం!

Advertiesment
అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు...ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం!
విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (15:09 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినేట్ స‌మావేశం ముగిసింది. ఇందులో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు త‌సుకున్నారు. రైతులకు 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 
 
 
అలాగే ఇటీవ‌ల వివాదాల‌కు తావిచ్చిన సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ,  అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సంక‌ల్పించారు. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 

 
రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారు. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయించాల‌ని ఆమోదించారు. శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌పాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటివారు దేశ ద్రోహులే : యోగి ఆదిత్యనాథ్