బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాగల 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో నేడు ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈనెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే వీలున్నదని వెల్లడించారు.