మా నాన్న పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్ షర్మిల

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (16:21 IST)
విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని తాను కూడా సమర్థించబోనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిల అన్నారు.
 
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ అసెంబ్లీ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేరు మార్పుపై వైఎస్ఆర్ కుమార్తె వైఎస్.షర్మిల మాట్లాడుతూ, ఇలా పేర్లు మార్చడం సరికాదన్నారు. పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుందన్నారు. 
 
ఏవో కారణాల వల్ల ఒక పేరు పెడతారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే తరతరాలకుగా వారికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందన్నారు. జనాల్లో గందరగోళాన్ని పొగొట్టినట్టు ఉంటుందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏం చేస్తున్నారో కూడా జనాలకు అర్థం కాకుండా పోతుందన్నారు.
 
తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తన తండ్రి పేరును వాడుకుంటారని... ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారని విమర్శించారు. వైఎస్సార్‌కు తానే అసలైన రాజకీయ వారసురాలినని, కాంగ్రెస్ పార్టీ కాదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments