Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

సెల్వి
మంగళవారం, 27 మే 2025 (18:26 IST)
నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సెంట్రల్ కోస్తా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ రెండో వారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, రాబోయే 24 గంటల్లో పశ్చిమ-మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. 
 
ఈ పరిణామం వల్ల రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 
 
నైరుతి రుతు పవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఫలితంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం క్రమంగా బలపడనుంది. మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. 
 
క్రమంగా రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి వాయుగుండంగా మారవచ్చని తెలుస్తోంది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments