జగన్ ప్రభుత్వ అసమర్ధత పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:38 IST)
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగితే అందరికంటే ఎక్కువగా తెలంగాణా రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పదే పదే తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేశాయి.

అందుకే తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం తెరాస కూడా గట్టిగా పనిచేసింది అనే సంగతి ప్రజలకి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ విషయాన్ని ఎన్ని విధాలుగా చెప్పినా సరే జగన్ అడిగిన ఒక్క అవకాశాన్నే ప్రజలు విని ఆయనకు ఓటు వేసి గెలిపించడం అనేది మనం చూశాం.

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయం కూడా తెలంగాణకు. మేలు చేకూర్చింది అనే విషయం అందరికి స్పష్టంగా మొదటి నెల రోజుల్లోనే అర్ధమైంది. ఆదాయం ఉన్న తెలంగాణకు హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అప్పణంగా రాసిచ్చారు ముఖ్యమంత్రి జగన్. 
 
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అందుబాటులో లేకుండా చేయటంలో రాష్ట్రంలోని నిర్మాణ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా రాష్ట్రం విడిచి తిరిగి తెలంగాణ వైపు దృష్టి సారించాయి. దాంతో ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గణనీయంగా వృద్ధి చెందింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 
 
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు చేసిన ప్రకటన దెబ్బకు రాష్ట్రానికి రావాల్సిన అనేక కంపెనీలు తెలంగాణా వైపు చూసాయి. ఇక చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలను కూడా విసిగించటంతో ఆ కంపెనీలు అన్ని కూడా తెలంగాణా తరలిపోయాయి. 
 
మూడు రాజధానుల ప్రకటనతో ఇప్పుడు అమరావతిలో వ్యాపారం నిలిచిపోయింది. దీనితో రాష్ట్రం కూడా వెనక్కు వెళ్లిపోయింది. తెలంగాణాలో భారీగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. అక్కడ భారీగా భూములను కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ 20 రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయారు. దీనిపై ఆ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
 
శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత అయిదేళ్ళ కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగు పడ్డాయని, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనకు కలిసి వచ్చాయని, దేశంలో కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉండటానికి కారణం అదే అని ఆయన చెప్పారు.

గత అయిదేళ్ళుగా తెలంగాణాలో రియల్ ఎస్టేట్ బాగా వెనకడుగు వేసింది దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్దే. ఇప్పుడు చంద్రబాబు దిగిపోవడం జగన్ నిర్ణయాలతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అదే విషయాన్ని హరీష్ రావు స్పష్టంగా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments