Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు జెండా చూడగానే జగన్ ఎందుకు వణికిపోతున్నారు

Advertiesment
పసుపు జెండా చూడగానే జగన్ ఎందుకు వణికిపోతున్నారు
, సోమవారం, 25 నవంబరు 2019 (18:53 IST)
చంద్రబాబు కడప జిల్లా పర్యటన సంధర్బంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించే అధికారం ఎవరిచ్చారంటూ టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సీఎం సొంత జిల్లాలో తెలుగుదేశంకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ హడలిపోతోంది. 
 
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇతర పార్టీ జెండాలు, ప్లెక్సీలు కట్టడానికి వీల్లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కులేదా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రాజరిక వ్యవస్థా? ప్రభుత్వకార్యాలయాలకు, జాతీయ జెండా, మహాత్మా గాంధీని వదలకుండా వైసీపీ రంగులు వేస్తే నోరుమెదపని అధికారులు తెలుగుదేశం ప్లెక్సీలను అనుమతి లేదంటూ తొలగించటం ఏంటి? అధికారులు ప్రభుత్వానికి తొత్తులగా పనిచేస్తున్నారా? ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అన్న సంగతి అధికారులు గుర్తుంచుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌