Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు... చెన్నైలో బోగి మంటలు వేసిన ఉపరాష్ట్రపతి

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (12:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుగుతున్నాయి. అలాగే, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన చెన్నైలోని తన కుమార్తె ఇంటికి వచ్చి, మంగళవారం వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. ఆ తర్వాత భోగి నీళ్లతో తలస్నానం చేశారు. అలా దేశ రెండో పౌరుడుగా ఉన్న వెంకయ్య తన కుటుంబంతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. 
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిశాయి. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ముందు భారీగా భోగి మంటలు వేశారు. ప్రజలు భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పర్వదినానికి స్వాగతం పలికారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments